ప్రయాగ్ రాజ్ లో ఈటల..
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు మరి కొంత మందితో కలిసి నిన్న యూపీ వెళ్లిన ఈటల రాత్రి అక్కడే బస చేశారు. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ప్రొటోకాల్ ఉన్నప్ప టికీ.. ఈటల సామాన్యుడిలా దాదాపు 10 కిలో మీటర్లు ప్రజలతో కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం స్థానిక పూజారులు ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఎంపీ ఈటల ప్రజలతోపాటు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది.

