అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతులు
మానవ సౌకర్యాలు కోసం ప్రకృతిని ధ్వంస రచన చేస్తున్న మానవుడు.. తను మాత్రమే ఈ భూమిపై జీవించడానికి అర్హత ఉన్నట్లు సాటి ప్రాణుల అస్తిత్వనికి సంకటంగా మారాడు. విపరీతమైన రేడియేషన్ ప్రభావం వల్ల ఇప్పటికే అరుదైన పక్షి జాతులు అంతరించిపోయాయి. మనతో పాటు సాటి జీవులు కూడా జీవించేటట్లు మనం మన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. జంతువుల అవాసాలను పరిరక్షించాలి. ఈ రోజు నేను హాస్పిటల్ నుండి విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సందర్భంగా ఒక చిన్న అరుదైన పక్షి రోడ్డుపై పడి ఉంది. దాని స్థితి ఇక చనిపోయే స్థితిలో ఉంది. కాళ్లకు దెబ్బ తగిలినట్లు ఉంది. పూర్తిగా స్పృహలో కూడా లేదు. వెంటనే దాన్ని నీడలో తీసుకొని వచ్చి కొంచం నీటిని తాగించి మెల్లగా ఆహారం అందించగానే శక్తిని పుంజుకుంది. తరువాత నెమ్మదిగా నెమ్మదిగా అలా గాలిలో ఎగిరిపోయింది. జీవ వైవిధ్యంలో ప్రతి ప్రాణితో మనకు సంభంధం కలిగి ఉంటాం. మానవ మనుగడ ప్రకృతితో అనుసంధానం అయ్యే ఉంటుంది. మనం జీవిద్దాం మనతో పాటు ప్రాణకోటిని రక్షిద్దాం…
డాక్టర్ అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె

