‘వారికి అంబానీ, అదానీతో పోటీపడేలా ప్రోత్సాహం’-సీఎం
తెలంగాణలో మహిళా సంఘాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంబానీ, అదానీతో పోటీపడేలా మహిళలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. వీహబ్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారు. మహిళాశక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుంది. యూపీఏ-1, యూపీఏ-2కు సోనియా సారథ్యం వహించారు. దేశానికి మేలు చేసే చట్టాలు తెచ్చేందుకు కృషి చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా లక్ష్యం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ కూడా లాభాల్లో నడుస్తోంది. ఇందుకోసం ఆర్టీసీకి రూ.5,200 కోట్లు చెల్లించాం. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మహిళలకు అప్పగించాం.” అని పేర్కొన్నారు.


 
							 
							