ఆ దేశ రాయబారితో ఎలాన్ మస్క్ రహస్య భేటీ
ఐక్యరాజ్యసమితికి ఇరాన్ రాయబారిగా ఉన్న అమీర్ సయీద్ ఇరవానితో ఎలాన్ మస్క్ రహస్యంగా భేటీ కావడం అనుమానాలకు దారి తీస్తోంది. అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గంటకు పైగానే చర్చలు జరిగినట్లు ఇరాన్‌కు చెందిన విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్‌లో ఆశ్రయం ఇవ్వడం, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధపడడం వంటి చర్యల ద్వారా ఇరాన్ ఇప్పటికే అమెరికాకు శత్రువుగా మారిన సంగతి తెలిసిందే.

