రోడ్డు మధ్యలో కరెంటు స్తంభాలు.. భూపాలపల్లి అధికారుల నిర్వాకం
తెలంగాణ భూపాలపల్లిలో కొత్తగా వేసిన రోడ్డుకు అడ్డంగా కరెంటు స్తంభాలు ఉన్నాయి. కొత్తగా వేసిన రోడ్డును చూసి అక్కడి ప్రజలు నివ్వెరపోతున్నారు. కరెంటు స్తంభానికి ఇరువైపులా చక్కగా రోడ్లు వేసేశారు అక్కడి అధికారులు, ఇంజనీర్లు. మరి వీరి పనిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు స్థానికులు. ఆరోడ్డుకు అఫ్రూవల్ ఇచ్చిన ఆఫీసర్లెవరో, రోడ్డు వేసిన ఇంజనీర్లకు సలాం కొడుతున్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండా కరెంటు స్తంభాలను అలాగే వదిలేసి, చుట్టూ చక్కగా రోడ్డు వేసుకుంటూపోయిన అధికారుల నిర్వాకానికి విస్తుపోతున్నారు ప్రజలు. సివిల్ ఇంజనీర్ స్టూడెంట్స్‌కు వీరితో పాఠాలు చెప్పించాలంటున్నారు.

