Home Page SliderNational

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్నికల నగారా

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం నేడు (మంగళవారం) ప్రకటించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది.

మహారాష్ట్రలోని 288 స్థానాల్లో 158 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని బీజేపీ వర్గాలు సమాచారం. ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేనకు 70 సీట్లు, అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు ఆఫర్ చేసింది. ఇప్పటికే హర్యానాలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన కాంగ్రెస్, ఈసారి మహారాష్ట్రలో ఆచితూచి అడుగులు వేయనుంది.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి మొత్తం 81 స్థానాలలో పోటీ చేస్తుందన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనున్నది. ఝార్ఖండ్ పదవీకాలం 2025 జనవరి 5 నాటికి ముగుస్తుంది.