“ఏక్ పేడ్ మాకే నామ్” మనందరి బాధ్యత..కిషన్ రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ డిల్లీ లోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు ఈ మొక్కను నాటినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మనందరి బాధ్యత అని, మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని.. కాబట్టి నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా, అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక వ్యక్తి ఒక మొక్క నాటాలని ఆకాంక్షించారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాలని కోరారు. అడవులు తగ్గిపోతుండటం, పచ్చదనం కోల్పోతున్న తరుణంలో భవిష్యత్తుకు ఒక పెను సవాల్ ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. భారతమాతను కూడా అమ్మలా భావిస్తాం.. భూమిని కూడా అమ్మలా భావిస్తాం.. కాబట్టి అమ్మ పేరుతో భారతమాతను భూమిని కాపాడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడుతూ సుంకేశుల డామ్ కులడం పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు. బిఆర్ఎస్ విలీనం పై మా పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవు. మీడియా పేపర్ కథనాన్ని చూసా. అధ్యక్ష మార్పు పై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.ఈసారి తప్పకుండా జమ్మూకాశ్మీర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

