Home Page SliderTelangana

ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాక్

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ED షాకిచ్చింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై తాజాగా ED నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు గతేడాది జూన్ లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు జరిపింది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ రోజే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో ఈడీ విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందరెడ్డి హాజరయ్యారు.