Andhra PradeshNews

జేసీ సొదరుడుకి ఈడీ దరువు

మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జేసీతోపాటుగా కాంట్రాక్టర్, ఆయన సన్నిహితుడు చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జేసీ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎలా సంపాదించారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. జేసీ ట్రావెల్స్ పేరుతో ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు నిర్ధారించారు. ఏపీ, తెలంగాణలో నడిపించే వాహనాలకు నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు ప్రభుత్వం గతంలో జేసీ తీరును ఎండగట్టింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలను చెప్పాలంటూ జేసీ కుటుంబ సభ్యులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. తుక్కు సామాను కింద వెహికల్స్ కొని… నకిలీ ఇన్వాయిస్‌తో జేసీ ట్రావెల్స్‌ నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని అధికారులు తేల్చారు. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు.