గిన్నిస్ రికార్డుల్లో దుబాయ్ రోలర్ కోస్టర్
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వర్టికల్ లాంచ్ రోలర్ కోస్టర్‌గా గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దుబాయ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 17న రోలర్ కోస్టర్‌ను ప్రారంభించారు. హిల్స్ మాల్‌ను దీనిని ఏర్పాటు చేశారు. గంటకు 41 కి.మీ. వేగంతో 670 మీటర్ల ట్రాక్‌ను భవనం చుట్టూ మలుపులు తిరుగుతూ నిలువుగా ఆకాశంలోకి వెళ్తుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రోలర్ కోస్టర్ వల్ల దుబాయ్ టూరిజం మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళిందని నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోలర్ కోస్టర్ గిన్నిస్ రికార్డుల్లో ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ గిన్నిస్ రికార్డ్‌ను జనాలకు తెలిపేందుకు బుర్జ్ ఖలీఫాపై ప్రసారం చేశారు. ఈ సందర్భంగా బుర్జ్ ఖలీఫా సంబరాలతో నిండిపోయింది.

