సహజీవనానికి కూడా వరకట్న కేసు
వరకట్న కేసు నమోదు చేయడానికి దంపతులే కానక్కరలేదని, సహజీవనం చేసినా వరకట్న వేధింపులపై కేసులు నమోదు చేయవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వరకట్న వేధింపుల కారణంగా హత్యకు గురైన మహిళ విషయంలో తాము వివాహం చేసుకోలేదని, ఈ కేసు నుండి విముక్తి కలిగించాలంటూ ఒక వ్యక్తి పెట్టిన పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. ప్రభుత్వ లాయర్ వాదనల ప్రకారం పిటిషనర్ ఇంటిలోనే ఆమె హత్యకు గురయ్యిందని, అతడి చేతిలో వరకట్న వేధింపులకు గురయ్యిదని తెలిసింది. దీనితో నేరం జరిగిన సమయంలో బాధితురాలు, నిందితుడు పెళ్లి అయినా, అవకపోయినా కలిసి ఉంటే చాలు విచారించి, శిక్షించవచ్చని హైకోర్టు పేర్కొంది.

