జీవో 1 పై ఆందోళన అక్కర్లేదు : ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు ర్యాలీలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీల హక్కును హరించే విధంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందంటూ విపక్షాలు అధికార పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలైన నేపథ్యంలో జీవో నెంబర్ ఒకటి పేరుతో పోలీసులు పలు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవో పై డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఎవరిని అడ్డుకోవడం లేదని జీవో నెంబర్ ఒకటి గురించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జీవో వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చామని అన్నారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు.


