డీప్‌సీక్ ఏఐకి ఈశాన్యరాష్ట్రాల గురించి తెలియదా..
చైనాకు చెందిన డీప్‌సీక్ ఏఐ చాట్‌బాట్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల గురించి తెలియదని బదులిచ్చింది. ఒక యూజర్ తాజాగా డీప్‌సీక్‌ని అరుణాచలప్రదేశ్ గురించి ప్రశ్న అడిగాడు. దీనికి డీప్‌సీక్ బదులిస్తూ ఇది నా పరిధి దాటిన అంశం.. వేరే ఏదైనా చర్చిద్దాం అంటూ సమాధానమిచ్చింది. అలాగే భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల గురించి కూడా ఇదే జవాబు ఇచ్చింది. ఇటీవల చైనా తమ దేశ మ్యాప్‌లో అరుణాచల ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చూపించింది. దీనిపై భారత్, చైనాల మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి. డీప్‌సీక్ ఏఐ చాట్‌బాట్ చైనాలోని ఏఐ స్టార్టప్ కంపెనీ. ఇది ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా, తక్కువ ఖర్చుతోనే ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఏఐ రంగంలో సంచలనంగా మారింది. వెబ్‌పేజీ, యాప్, ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంది. ఇది అచ్చం చాట్‌జీపీటీని పోలి ఉంటుంది.

