HealthHome Page SliderLifestyleTrending Today

మనం త్రాగుతున్న నీళ్లు విషంగా మారుతుందా..?

అలసటగా అనిపించినా లేదా చర్మం పొడి బారినట్లు అనిపించినా.. ఎక్కువ నీళ్లు తాగాలని మన పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం సరైందా? ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల వాటర్ పాయిజనింగ్ అవుతుందా?. ఫుడ్ పాయిజనింగ్ లా వాటర్ పాయిజనింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాటర్ పాయిజనింగ్ ను వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హై హైపర్ హైడ్రేషన్ అని కూడా పిలుస్తారు. నీటిని అధికంగా తీసుకున్న వెంటనే సోడియం పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. దీంతో మూత్ర పిండాలు పెద్ద మొత్తంలో నీటిని బయటకు పంపలేక అది పాయిజనింగ్ గా మారిపోతుంది. ఇది ఉబ్బరం పాలి యూరియా, హైపోనట్రేమియా బలహీనమైన జీవక్రియకు దారి తీస్తుంది. మూత్ర పిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే బయటకు పంపగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను బయటకు పంపాల్సి వచ్చినప్పుడు కణాల వాపు గుండె పోటు వంటి లక్షణాలు ఎదురవుతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారిన పడుతున్నారు. ఒక వ్యక్తి రోజులో ఎంత నీరు త్రాగవచ్చు అని చెప్పడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకు గురై మూత్ర పిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు రెండు లీటర్లు నీటిని త్రాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.