బాలుడికి సిగరెట్ తాగించిన వైద్యుడు
జలుబుతో బాధపడుతున్న బాలుడితో డాక్టర్ సిగరెట్ తాగించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జలౌన్‌లో చోటు చేసుకుంది. జలుబుతో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడిని తల్లిదండ్రులు డా. సురేశ్ వద్దకు తీసుకువచ్చారు. అతను వైద్యం చేయకపోగా బాలుడితో సిగరెట్ తాగించారు. పొగ పీలిస్తే జలుబు తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డాక్టర్ పై ఫైర్ అవుతున్నారు. ఏ డాక్టరైన ఇలా చికిత్స చేస్తాడా.. వీడే అసలు డాక్టరేనా.. అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

