మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్
ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్‌డి) బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది.
టోక్యో: ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు జపాన్ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్‌డీ) బారినపడే ప్రమాదం అధికంగా ఉన్నట్టు తేలింది. బాల్యంలో ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల ఎఎస్డీతో పాటు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ADHD) కు పిల్లలు గురౌతారని పరిశోధల్లో తేలిందని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు.

