కొండంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా?
తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి, ” నువ్వు నీ తమ్ముడు చేసే అరాచకాలు చూసి తెలంగాణ సమాజం మిమ్మల్ని ఛీత్కరించుకుంటుంది.మిమ్మల్ని అధికారం నుంచి సాగనంపే రోజులు ఎంతో దూరంలో లేవు ” అంటూ మాజీ మంత్రి కేటిఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెట్టడం అనేది రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి…..కొడంగల్ రైతులను చితకబాదుతుంటే లైవ్ చూసి ఎంజాయ్ చేశాడని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికైన శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా రైతుల తరపున అన్ని రూపాల్లో కొట్లాడుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దోస్తు అదానీ గురించి మాట్లాడదామంటే తమని అసెంబ్లీలోకి రానివ్వరని, రైతుల గురించి మాట్లాడదామంటే అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండరని ఎద్దేవా చేశారు.


 
							 
							