Home Page SliderNationalNews Alert

సినిమాలు ఎందుకు ప్లాప్‌ అవుతున్నాయా తెలుసా? : నవాజుద్దీన్

భారీ రెమ్యునేరేషన్‌ తీసుకొనే నటులపై బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్ధీఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ రెమ్యునేరేషన్‌ తీసుకోవడం వల్ల సినిమాలకే నష్టం వాటిల్లుతోందన్నారు సిద్ధీఖీ. నటులు తీసుకునే రెమ్యునేరేన్‌పై సినిమా బడ్జెట్‌ను పెంచుతుందన్నారు. చివరికి అది లాభాలపై ప్రభావం చూపిస్తోందన్నారు. బాక్సాఫీస్‌ వసూళ్లను గమనించడం నిర్మాత బాధ్యత. టికెట్‌ ధరలు, అమ్మకాల గురించి నటీనటులు పట్టించుకోవడం అవసరం లేదన్నారు. తక్కువ వ్యయంలో చేసిన సినిమాలు ఎప్పుడూ ప్లాప్‌ కావు. ప్రతిసారీ సినిమా బడ్జెట్‌ పరిమితులు దాటితే అది చివరకు అట్టర్‌ ప్లాప్‌ అవుతుందని నవాజుద్దీన్‌ సిద్ధీఖీ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.