HealthInternational

రోజు క్యారెట్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందిని మన అందరికి తెలుసు . కానీ క్యారెట్‌లో వుండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగిస్తాయి. దుంప జాతికి చెందిన క్యారెట్ ఇంతకుముందు శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఏడాది పొడవునా దొరుకుతోంది. క్యారెట్ తినడం వల్ల కళ్లు, కాలేయం, కిడ్నీలు, ఇతర శరీర భాగాలు కూడా చాలా ప్రయోజనాలను పొందుతాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా క్యారెట్ కళ్ళకు చాలా ఉపయోగకరం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా ఉంటుంది. ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. షుగర్ తో ఉన్న వారికీ కూడా క్యారెట్ వాళ్ళ చాలా లాభాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్‌కు మంచిది. పచ్చి లేదా కొద్దిగా వండిన క్యారెట్‌లు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇందులో 90 శాతం వరకు నీరు ఉంటుంది మరియు ఫైబర్, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. దీని వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.