పుట్టగొడుగులు పుట్టెడు లాభాలు తెలుసా?
మష్రూమ్స్ ఆరోగ్యకరమైన, మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్ డి, ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని అంది స్తాయి. తక్కువ కేలరీలు ఉండటం కార ణంగా బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. పుట్టగొడుగులలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రిబోఫ్లేవిన్, ఫోలేట్, థియామిన్, పాంతోతేనిక్ యాసిడ్, నియాసిన్.. మనం తీసుకునే ఆహారం నుంచి శక్తిని వినియోగించు కోవడానికి, శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. రోగ నిరోధక శక్తి బూస్టర్స్ గా పని చేస్తాయి. క్యాన్సర్ నయం చేయడంలో, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచడంలో, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

