NewsNews AlertTelangana

కమ్యూనిస్టుల్లారా.. ఇంత ఘోరంగా అమ్ముడుపోతారా?

కమ్యూనిస్టుల్లారా ఇంత ఘోరంగా అమ్ముడుపోతారా అని మునుగోడు వేదిక పైనుంచి సిపిఐ సిపిఎం నాయకులను హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులు సమ్మె చేస్తే కార్మిక నాయకులు ఏనాడైనా ప్రగతి భవన్లో అడుగుపెట్టగలిగారా? అని నిలదీశారు. కార్మికుల, పేదల పక్షాన వార్తలు రాసిన మన తెలంగాణ పత్రికను తన చేతుల్లోకి తీసుకున్న కేసీఆర్ ఈరోజు సిపిఐ వాళ్లకు ప్రగతి కాముకుడిగా కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను జైల్లో వేయించి, గర్భిణీ మహిళలపై పోలీసులతో దాడులు చేయించిన కేసీఆర్ కు మీరు ఎలా మద్దతు ఇస్తారని నిలదీశారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేముందు ఎనిమిదిన్నర ఏళ్లలో వామపక్షాల పట్ల కార్మికులు పేదల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరును ఓసారి ఆలోచించుకోవాలని ఈటల సూచించారు.