Home Page SliderNational

తొలిఆర్థిక త్రైమాసికంలో లాభాల బాటలో డీమార్ట్

ప్రముఖ సూపర్ మార్కెట్ డీమార్ట్ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో డీమార్ట్ రూ.774 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 17.5శాతం వృద్ధి సాధించినట్లు అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీంతో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ.14,069కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది.అయితే దేశంలో మరో 6 నూతన స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం డీమార్ట్ల సంఖ్య 373కి చేరినట్లు తెలిపింది.