వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్ష భవనం లో దీపావళి వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్లి బైడెన్ కూడా పాల్గొన్నారు ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ సైతం పాల్గొన్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు ఈ సంవత్సరం దీపావళి వేడుకలను వైట్ హౌస్ లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మనమందరం సమానంగా సృష్టించామని… అమెరికన్ ఆదర్శాలు… అమెరికన్ చరిత్ర నిరంతర పోరాటాలమయమన్నారు. చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని గుర్తు చేయడం ద్వారా, దీపావళి అనేది ఇక్కడ అమెరికాలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచానికి వెలుగుని తెచ్చే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తుచేస్తుందన్నారు.
అందరికీ ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా ఉందన్నారు అధ్యక్షుడు బైడెన్. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆసియా అమెరికన్లు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. దీపావళి వేడుకను సంతోషకరమైన భాగంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు బైడెన్. యునైటెడ్ స్టేట్స్, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఈ దీపాల పండుగను జరుపుకుంటున్న ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది హిందువులు, జైనులు, సిక్కులు మరియు బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, దీపావళి వేడుకను ఆనందంగా జరుపుకున్నందుకు USలోని ఆసియా అమెరికన్ సమాజానికి బిడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికన్ సంస్కృతిలో దీపావళి ఒక భాగమయ్యిందన్నారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నేతృత్వంలోని అత్యంత వైవిధ్యంగా….. దీపాలను వెలిగించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు బైడెన్.

