Telangana

ఈటలతో దివ్యవాణి భేటీ

సినీ నటి దివ్యవాణి ఇవాళ బీజేపీ సీనియర్ నేత, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలిశారు. దివ్యవాణి ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. విషయ పరిజ్ఞానంతోపాటు.. సూటిగా మాట్లాడటం, పార్టీ వాయిస్ బలంగా విన్పించడంలో దివ్యవాణి దిట్ట. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించి సమర్థవంతంగా ప్రజలకు చేరాల్సిన పాయింట్‌ను చేర్చుతారన్న గుర్తింపు ఆమెకు ఉంది. దివ్యవాణి ఈటలతో భేటీ కావడంతో ఆమె బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వాయిస్‌ను బలంగా తీసుకెళ్లేందుకు తాను సిద్ధమన్న వర్షన్ ఆమె, ఈటలకు వివరించినట్టు తెలుస్తోంది. ఇటీవల కొద్దిరోజులుగా దివ్యవాణి వైసీపీలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి… తాజాగా ఈటలతో భేటీ కావడంతో కాషాయకండువా కప్పుకోవడం ఖాయమనిపిస్తోంది.