రేవంత్ ఆశలు అడియాశలే.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ కానున్నారు. వాస్తవానికి సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్ సభకు గానీ, రాజ్యసభకు గానీ పంపించాలని రేవంత్ రెడ్డి భావించారు. పార్టీ నేతలు సైతం సోనియా గాంధీ తెలంగాణకు ప్రాతనిధ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అయితే సోనియా గాంధీ మరోలా ఆలోచించారు.

ఇక ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. గాంధీ కుటుంబానికి అడ్డాగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీకి ఇదే తొలి ఎన్నిక. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా పెద్ద మార్పు అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనియా గాంధీ దశాబ్దాలుగా రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో కూడా ఆమె ఈ సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా… సోనియా ఇక్కడ్నుంచి గెలినప్పటికీ… అమేథీలో రాహుల్ గాంధీ… బిజెపి నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.

