డీజిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదం..
హైదరాబాద్‌లోని కూకట్ పల్లి వద్ద ఐడీఎల్ చెరువు సమీపంలో డీజిల్ ట్యాంకర్‌లో అకస్మాతుగా మంటలు అంటుకున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగసి పడడంతో పక్కనున్న కారు కూడా దగ్ధమయ్యింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

