మన్యంలో ఏనుగులు చనిపోయాయా? చంపేసారా?
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని మండలం, కాట్రగడలో నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై మరణించాయి. చనిపోయిన వాటిలో ఒకటి పిల్ల ఏనుగు కాగా, మూడు పెద్ద ఏనుగులు. అయితే ఈ ఏనుగుల మరణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలా తాకాయని, కావాలనే వాటిని ట్రాన్స్‌ఫార్మర్ వైపు తరిమారా ? అనేది తేలవలసి ఉంది. ఈ ఏనుగుల గుంపులోని మరో రెండు ఏనుగులు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. అయితే తప్పించుకున్న ఏనుగులు తివ్వా కొండలపైకి వెళ్లిపోయాయని, అవి చనిపోయాక చాలాసేపు అక్కడే ఉన్నాయని, అవి వీటి కోసం తిరిగి వస్తాయేమోనని భయపడుతున్నారు గ్రామస్తులు.

