Home Page SliderNational

ధోని మోకాలి ఆపరేషన్ విజయవంతం

టీమిండియా మాజీ కెప్టెన్,CSK టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ IPL సీజన్లో మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మ్యాచ్ ఎలా ఆడతారో అని ధోని ఫ్యాన్స్ అంతా చాలా ఆందోళన పడ్డారు. అయితే ధోని మాత్రం ఆ నొప్పిని లెక్కచేయకుండా CSK టీమ్‌ను ఫైనల్‌కి చేర్చడమే కాకుండా IPL ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నారు. దీంతో CSK టీమ్‌తో పాటు CSK అభిమానులు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో IPL ఫైనల్ ముగిసిన 48 గంటల తర్వాత ధోని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ధోనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. కాగా దీనికి ధోని వెంటనే అంగీకార తెలిపారు.దీంతో వైద్యులు ఈ రోజు ఉదయం ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. అయితే ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని  వైద్యులు వెల్లడించారు.  దీంతో ఆయన అభిమానులు ధోనీ గెట్ వెల్ సూన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.