Home Page SliderNationalSports

రిటైర్‌మెంట్‌పై ధోనీ కీలక వ్యాఖ్యలు

క్రికెట్ ప్రేమికుల ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటికే కొన్ని ఈవెంట్లలో రిటైర్‌మెంట్ తీసుకున్నారు ధోనీ. అయినా ఐపీఎల్‌లో ఆడుతుండడంతో కేవలం ధోనీని చూడడానికి, అతని మ్యాజిక్ బ్యాటింగ్ మెరుపులు చూడడానికి ఐపీఎల్ చూసే వీరాభిమానులు ఉన్నారు. అయితే వచ్చే ఐపీఎల్‌లో కూడా ధోనీ ఆడరేమో అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయంపై సస్పెన్స్‌కు తెర దించుతూ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ తాను ఇప్పుడు ఐపీఎల్ నుండి రిటైర్ తీసుకోవడం లేదంటూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. మరికొన్నాళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. ప్రొఫెషనల్‌గా గేమ్స్ ఆడితేనే విజయం సాధించగలమని చెప్పారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, క్రికెట్‌లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అయితే ధోనీ మైదానంలో కనిపిస్తారన్న వార్తలు విన్న అభిమానులు పండగ చేసుకుంటున్నారు.