Home Page SliderNational

కొత్త లుక్‌లో అదరగొట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఇంటర్నెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అయితే రిటైర్ అయినప్పటికీ ధోనీ ఏజ్ పెరిగే కొద్దీ మరింత యవ్వనంగా కన్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌-2024లో తలా లాంగ్ హెయిర్‌తో వింటేజ్ లుక్‌లో కన్పించారు. అయితే ఇప్పుడు మరో కొత్తలుక్‌తో ధోనీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కాగా ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. దీంతో ఎమ్ఎస్ ధోనీ సూపర్ హ్యాండ్‌సమ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.