ముఖ్యమంత్రితో డీజీపీ, ఏఏజీ సమావేశం
అమరావతి: సీఎం జగన్‌తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేయడం, ఫైబర్‌నెట్, ఇన్నిర్ రింగ్ రోడ్, అమరావతిలో ఎసైన్డ్ భూములకు సంబంధించిన కేసులు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో సీఎంతో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

