ఏపీలో ఘాటెక్కిన మిర్చి ధర
గుంటూరు, మనసర్కార్
వరంగల్ మార్కెట్‌లో దేశీరకం మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో మిర్చి దిగుబడి తగ్గడంతో దీని ధర ఆకాశాన్నంటింది. ఈ మేరకు దేశీరకం మిర్చి ధర మరోసారి రికార్డు సృష్టించింది. ఒక క్వింటాల్ మిర్చి ధర రూ.90 వేలు పలికింది. దేశీరకం మిర్చి నాణ్యతలో అన్నింటికంటే మెరుగ్గా ఉండంతో ఎక్కువ ధర పలికినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే క్వింటాల్ మిర్చి ధర త్వరలోనే లక్షకు చేరతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏపీలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సామాన్య ప్రజలు రాష్ట్రంలో వరుసగా పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీటిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సివుంది.