InternationalNationalNews

అమెరికాలో భారతీయ మహిళకు అత్యున్నత పదవి

అమెరికాలో భారతీయం ఆవిష్కృతమవుతోంది. అమెరికాలో కీలక సంస్థలకే కాదు… అమెరికా ప్రభుత్వంలోనూ ఇప్పుడు ఇండియన్స్‌కు డెమొక్రట్లు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా ఇండియన్-అమెరికన్‌ రాధా అయ్యంగర్‌కు కీలక పదవి అప్పగించారు అమెరికా అధ్యక్షుడు జై బైడెన్. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియామకానికి ముందు రాధా అయ్యంగార్, గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ… రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అంతకు ముందు బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, టెక్నికల్ రీసెర్చ్‌లో క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లకు ఆమె నేతృత్వం వహించారు. రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పదవికి బైడెన్ నామినేట్ చేశారు.

ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాధ అమెరికా రక్షణ శాఖ కీలక విభాగం పెంటగాన్ ఉన్నత స్థానానికి నామినేట్ అయ్యారు. రాధ గతంలో ఫేస్‌బుక్‌లో విధాన విశ్లేషణ అధికారిగా, గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. అక్కడ ఎక్కువ ప్రమాదకర అంశాలపై ఫోకస్ పెట్టడంతోపాటు… క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా సమస్యలపై దృష్టి సారించారు. గతంలో రాధ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో జాతీయ భద్రతా సమస్యలపై అనేక కీలక పదవుల్లోనూ పనిచేశారు. కెరీర్ ఆరంభంలో ప్లంబ్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.

ఏప్రిల్‌లో భారతీయ-అమెరికన్ దౌత్యవేత్త రచనా సచ్‌దేవా కొర్హోనెన్‌ను మాలిక్ రాయబారిగా నామినేట్ చేశారు. ఒక నెలలో భారతీయ-అమెరికన్ మూడో వ్యక్తిని నామినేట్ చేశారు. మార్చిలో, అధ్యక్షుడు బైడెన్ ఇద్దరు భారతీయ-అమెరికన్లను US రాయబారులుగా నామినేట్ చేశారు. దౌత్యవేత్త పునీత్ తల్వార్‌ను మొరాకోలో దేశ రాయబారిగా, రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌కు రాయబారిగా నామినేట్ చేశాడు. స్లోవేకియాకు కొత్త యుఎస్ రాయబారిగా భారత-అమెరికన్ కెరీర్ దౌత్యవేత్త గౌతమ్ రాణాను అమెరికా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేయబోతున్నారని వైట్ హౌస్ ఇటీవల పేర్కొంది.