ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండల డిప్యూటీ తహసీల్దార్ ఇంద్రాల మల్లేశం ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్ రావు 2.25 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ చేయాలని డిప్యూటీ తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గాను రూ.6 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఇవాళ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

