తిరుమల పట్టువస్త్రాల స్కాంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన
తిరుమలలో వెలుగులోకి వచ్చిన పట్టువస్త్రాల స్కాంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే టీటీడీలో జరుగుతున్న అక్రమాలు బయటపడుతున్నాయని ఆయన తెలిపారు.
హిందూ మత విషయాలను కొందరు చిన్నచూపు చూస్తున్నారని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, పరకామణి అంశంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవికాదన్నారు. “ఈ సంఘటన ఆయన మతంలో జరిగి ఉంటే కూడా ఇదే విధంగా చిన్న విషయమని కొట్టిపారేసేవారా?” అని ప్రశ్నించారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

