Breaking NewsHoroscope TodayNews

సూట్ కేస్ లో మ‌హిళ మృత‌దేహం

తమిళ‌నాడులోని మింజూర్ రైల్వేస్టేష‌న్‌లో సూట్ కేస్‌లో ఉన్న మహిళ మృత‌దేహాన్నిరైల్వే పోలీసులు గుర్తించారు.నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న ట్రైన్‌లో ఎక్కిన సుబ్ర‌హ్మ‌ణ్యం,దివ్య శ్రీ అనే తండ్రి కూతుళ్లు ఓ మ‌హిళ మృత‌దేహాన్ని సూట్ కేసులో పెట్టి ప్ర‌యాణం చేశారు.మింజూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోకి రాగానే మృత‌దేహం ఉన్న సూట్ కేస్ ని రైలు నుంచి విసిరేశారు. అయితే అది ప్లాట్ ఫాం మీద ప‌డ‌టంతో సూట్ కేసు నుంచి ర‌క్తం కారింది .స్థానికులు గ‌మ‌నించి రైల్వే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే రైలులో ఉన్న రైల్వే పోలీసుల‌కు మింజూర్ అధికారులు స‌మాచారం ఇచ్చి నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.