కటకటాలపాలయిన పంజాబి గాయకుడు దలేర్ మెహందీ
మానవ అక్రమ రవాణా కేసులో ప్రముఖ పంజాబి గాయకుడు దలేర్ మెహందీ కటకటాల పాలయ్యారు. 2018లో కింది కోర్టు విధించిన 2 ఏళ్ళ జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన చేసుకున్న అపీల్‌ను పటియాలా అడిషనల్ సెషన్స్ గురువారం కొట్టి వేసింది.ఈ మేరకు పోలీసులు పటియాల జైలుకు తరలించారు. 2003లో మనుష్యులను అక్రమంగా అమెరికా, కెనడా తరలిస్తున్నారని దలేర్ మెహందీ, ఆయన సోదరుడు షంషేర్ మెహందీలపై కేసు నమోదయ్యింది. అంతే కాకుండా 1998-99 లలో 10 మందిని అమెరికా తీసుకు వెళ్లి అక్కడే వదిలి వచ్చారని మెహందీ సోదరులపై అభియోగాలు వచ్చాయ్. అయితే ఈ కేసులకు సంభందించి ఆయనను దోషిగా నిర్దారించిన కోర్టు 2018లో 2 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే ఆయన అప్పుడు బాండ్ బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ చేసుకున్న అపీల్ ను పటియాలా కోర్టు తిరస్కరించింది.
Read More: మహరాష్ట్ర ప్రజలకు సీఎంగా షిండే తొలి కానుక