NationalNews

సింహం పంజా విసరనూ గలదు…

Share with

కొత్త పార్లమెంట్ భవనంపై ప్రధాని మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై ఈమధ్య వింత చిచ్చు రేగిన సంగతి మనకు తెలిసిందే . కొత్త చిహ్నంపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సారనాథ్ లో అశోక స్తూపంలో ఉండే  నాలుగు సింహాలు హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే, ఈ పార్లమెంట్ కొత్త భవనంలో సింహాలు క్రూరంగా ఉన్నట్లుగా… గర్జిస్తున్నట్లుగా దూకుడు స్వభావంతో కనిపిస్తున్నాయని… ఆ సింహల ప్రతిమలను  మార్చాలంటూ రచ్చ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్,మొదలైన పార్టీలు రకరకాలుగా ట్వీట్‌లు చేస్తున్నాయి. ఈసందర్భంలో ఉత్తరాదికి చెందిన ప్రసిద్ద నటుడు అనుపమ్‌ఖేర్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ ట్వీట్ చేసారు. ఈ సింహాలు స్వతంత్ర భారతానికి చెందినవని, పెంపుడు జంతువులు కాదని, అవసరమైతే పంజా విసరగలవని… రూపురేఖల్లో కొంచెం తేడాలున్నంత మాత్రాన జాతీయ చిహ్నాన్ని అవమానించినట్లు కాదని, జైహింద్ అని ప్రభుత్వాన్ని సమర్ధించారు.

Read More: పదునైన పదజాలంపై పార్లమెంట్ నిషేధం..!