Home Page SliderTelanganatelangana,viral

వానరాల యుద్ధంతో ఊరంతా కర్ఫ్యూ..

‘మనుషులేనా ముఠా తగాదాలు పెట్టుకునేది..మేమూ పెట్టుకుంటాం’.. అంటూ వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లందులో రెండు వానర ముఠా గుంపులు బీభత్సంగా కొట్టుకున్నాయి. దీనితో ఆ ఊరిలో కర్ఫ్యూ వాతావరణం గోచరించింది. ఒక కోతుల గుంపు ఈ ప్రాంతానికి రావడంతో, అక్కడే స్థానికంగా ఉన్న కోతుల గుంపుకు కోపం వచ్చింది. ఇంకేముంది.. యుద్ధం మొదలయ్యింది. రామాయణ కాలం నాటి వానరాల యుద్ధాన్ని తలపించేలా వందల సంఖ్యలో కోతులు యుద్ధం చేసుకున్నాయి. రక్తం కారేలా రక్కుకున్నాయి. దీనితో స్థానిక ప్రజలు కూడా ఇంటి తలుపులు తీసి, బయటకు రావడానికి భయపడ్డారు. అవెక్కడ తమపై దాడి చేస్తాయో అని వణికిపోయారు. రెండు గంటల పాటు ఈ భీకరయుద్ధం జరిగాక కోతుల గుంపులు శాంతించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.