వైసీపీ ఓటమిపై సీపీఐ నేత కీలక వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని ,అది లేకపోవడం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలయ్యిందని వెల్లడించారు. కాగా బీజేపీతో ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారన్నారు. ఈ విధంగా జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. అయితే అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఓట్ల శాతం ఆధారంగా కాదని నారాయణ స్పష్టం చేశారు. కాగా ఏపీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే వైసీపీ 11 స్థానాలకే పరిమితమైందని నారాయణ తెలిపారు.

