NewsTelangana

బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీపీ రంగనాథ్

ఇటీవల కాలంలో తెలంగాణాలో TSPSC ,10 వ తరగతి పరీక్ష పేపర్లు లీకైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 10 వతరగతి పేపర్ లీక్ రాజకీయాల్లో భీభత్సం సృష్టించింది. కాగా తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణా పోలీసులు ఆయనని అరెస్ట్ కూడా చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన బండి సంజయ్ వరంగల్ సీపీ రంగనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

 కాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై వరంగల్ సీపీ రంగనాథ్ మండిపడ్డారు. తాజాగా ఈ విషయమై వరంగల్ సీపీ రంగనాథ్  మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..వాళ్ల ఆరోపణలకు నవ్వాలో..ఏడవాలో అర్థం కావట్లేదన్నారు. నేను ఎక్కడైనా సెటిల్‌మెంట్ చేసినట్టు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని..బండికి వరంగల్ సీపీ సవాల్ చేశారు. సత్యంబాబు కేసుపై బండికి పూర్తిగా అవగాహన లేదన్నారు. అసలు సత్యంబాబు కేసు హ్యాండిల్ చేసింది తాను కాదన్నారు వరంగల్ సీపీ. ఏ కేసులో అయినా నిందితులుగా ఉన్నవారు మాత్రమే దర్యాప్తును తప్పుబడుతుంటారన్నారు. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారని వరంగల్ సీపీ బండి సంజయ్‌ను ప్రశ్నించారు.రఘునందన్ కాల్ డేటా విషయంలో మరికొన్ని అంశాలు తెలుసుకోవాలన్నారు. దర్యాప్తును రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నా అని అన్నారు. పోలీసు స్టేషన్ అనేది న్యాయం అందించడానికి తొలి మెట్టు అన్నారు. కాబట్టి నా దగ్గరకు వచ్చిన వాళ్లకి న్యాయం చేయడానికే నేను ప్రయత్నిస్తానన్నారు. స్పెషల్ ఆఫీసర్‌గా నన్ను నందిగామకు పంపించారన్నారు. బండి సంజయ్ నాపై పలు ఆరోపణలు చేసి ప్రమాణాలు చేయాలని కోరారన్నారు. ఈ విధంగా చూస్తే నేను ఇప్పటి వరకు 10 వేలసార్లు ప్రమాణాలు చేయాలన్నారు సీపీ రంగనాథ్.