Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPoliticsviral

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో శుక్రవారం ఉదయం ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతులు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి రంగంలోకి దింపగా, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌ లో సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రత్యర్థిపై 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంచనాల తగ్గట్లు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఇప్పుడు ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ధన్ ఖఢ్ బహిరంగ కార్యక్రమంలో కనపడడం నేడే తొలిసారి.