Home Page SliderNational

ఒక్కరోజులో 20 శాతం పెరిగిన కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోందా అన్నట్టుగా కేసులు పెరుగుతున్నాయ్. దేశంలో 24 గంటల్లో 12,591 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 20 శాతం మేర కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులు పెరగడానికి కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16గా వైద్యులు నిర్ధారించారు. అయితే కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటుగా, బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. 24 గంటల్లో 1,767 కేసులు నమోదు కాగా.. ఆరుగురు కరోనాతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీలో ఒక్కరోజులో 15 శాతం కేసులు పెరిగాయి. ఇక మహారాష్ట్రలోనూ కరోనా కేసులు ఒక్కరోజులో 1100కి చేరుకున్నాయి. 4గురు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక ముంబై నగరంలో 234 కరోనా కేసులు నమోదయ్యాయి.