ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం..
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా గరిడేపల్లి వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కారును ఆపమన్నారు. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అంతే వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సురక్షితంగా బయటపడటంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

