కానిస్టేబుల్‌ను కోటీశ్వరుడిగా మార్చినా..రూ.6 లాటరీ టికెట్
కాలం కలిసోస్తే బళ్ళు ఓడలు.. ఓడలు బళ్ళు అవుతాయని అంటూ ఉంటారు. ఇది ఒక సామాన్య కానిస్టేబుల్ జీవితంలో నిజమయ్యిందనే చెప్పాలి. 6 రూపాయల లాటరీ టికెట్ ఆయన జీవితాన్నే మార్చేసింది.ఆయనే పంజాబ్ లూథియానాకు చెందిన కుల్ దీప్ సింగ్. ఈయన ప్రస్తుతం పంజాబ్‌లోని కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.అయితే కుల్ దీప్ సింగ్ తల్లి ఆయనను ఎప్పుడూ లాటరీ టికెట్ కొనాలని సూచించేవారు.
దాంతో ఆయన తన తల్లి మాట కాదనలేక అప్పుడప్పుడూ..లాటరీ టికెట్స్ కొనేవారు.ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఒక లాటరీ టికెట్‌ను కొన్నారు. అయితే తాజాగా తీసిన లక్కీ డ్రాలో కుల్ దీప్ సింగ్ కేవలం రూ.6లతో కొన్న లాటరీ టికెట్ ఆయనకు కోటి రూపాయల జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టింది. దీంతో ఒక సామాన్య కానిస్టేబుల్ గా ఉన్న కుల్ దీప్ సింగ్ ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు.