Andhra PradeshHome Page Slider

చంద్రబాబును జైల్లోనే చంపే కుట్ర : నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అంతం చేసేందుకు అరెస్టు చేశారన్న అనుమానం కలుగుతుందని చంద్రబాబు తనయుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తమ అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయని చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేతకు జైల్లోనే హాని తల పెట్టేలా సర్కార్ కుట్ర పన్నుతుందని జైల్లో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవలేశ్వరానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ డెంగీ భారిన పడి మరణించారని చంద్రబాబును ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి ఏం జరిగినా ఈ సైకో ప్రభుత్వానితే బాధ్యతని లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.