భారత కీలక నేతపై ఆత్మాహుతి దాడికి కుట్ర…!
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని రష్యా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు.

అంతేకాదు భారతదేశ అధికార వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా తెలిపింది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు అతడు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సంబధింత అధికారులు ప్రకటించారు .

