NewsTelangana

ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

కాంగ్రెస్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి దేశ వ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. ఇటీవల ఎక్కడ చూసినా ఆమె గురించిన వార్త భూతద్దం వేసిన కన్పించడం లేదు. ఐతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా జరుపుతున్న నిరనస ప్రదర్శనలు రెండ్రోజులుగా ఉద్రిక్తంగా మారుతున్నాయ్. పోలీసులపై అనుచిత ప్రవర్తన కారణంగా… తాజాగా రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు. మొన్న కాంగ్రెస్ ముఖ్య నేత చిదంబరాన్ని పోలీసులు తోసేయడంతో ఆయన పక్కటెముకలకు గాయలయ్యాయి. సీనియర్ నేత వేణుగోపాల్ సైతం దాడుల్లో గాయపడ్డారు. ఐతే రాహుల్ విచారణపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. ఇక హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన చలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ ముట్టడి సమయంలో కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఎస్ఐ ఉపేంద్ర బాబు కాలర్ పట్టుకొని జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు రేణుక చౌదరిని సైతం అరెస్టు చేశారు. ఐతే తాను కావాలని ఎస్ఐ కాలర్ పట్టుకోలేదని… వెనుక నుంచి కార్యకర్తలు తోసేయడం వల్లే అలా జరిగిందంటూ వివరణ ఇచ్చారు రేణుక. తాను కేవలం ఎస్ఐ భుజం పట్టుకున్నానన్నారు. మహిళల చుట్టూ మగ పోలీసులను ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని రేణుకు విమర్శించారు.