కాంగ్రెస్ పాలకులు కాలక్షేపం చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
టిజి: కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద గౌరవం లేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా హామీలు అమలు చేయకుండా టైం పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వరికి మద్దతు ధర, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు.

