NewsNews AlertTelangana

అతివేగంతో రోడ్ డివైడర్‌ను ఢీకొని కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

హైదరాబాద్‌లో ఈరోజు ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలాఖాన్ దంపతుల కుమార్తె తనియాకక్డే… ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతంరాయి వద్ద తనియా, ఇంకా ముగ్గురితో కలిసి తన ఐ-10 కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా రోడ్ డివైడర్‌ను ఢీకొని యాక్సిడెంట్‌కు గురైయ్యింది. ముగ్గురు తీవ్రంగా గాయపడగా, తనియా అప్పడికప్పుడే  మరణించారు. గాయపడిన వారిని తక్షణమే శంషాబాద్ RGI ఎయిర్‌పోర్ట్ పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా కారు అతివేగంగా వెళుతున్నట్లు గుర్తించారు. వేగంపై నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read more: 2024లో ప్రధాని అభ్యర్థి పై అమిత్ షా క్లారిటీ